MS Dhoni Conferred Padma Bhushan, Dedicates His Honor To Indian Army

2018-04-04 2

MS Dhoni was on Monday conferred the third highest civilian award, Padma Bhushan. Dhoni posted the image of him receiving the honor and dedicated it to the brave Men and Women of the army. He wrote, "An honour to get the Padma Bhushan and receiving it in Uniform increases the excitement ten folds.

సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ధోనీ.. ఆర్మీ దుస్తుల్లో అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇలా అందుకోవడంతో ధోనీ సంతోషం పది రెట్లు పెరిగిందని తెలిపాడు.
ఈ సందర్భంగా చేసిన పోస్టులో ధోనీ.. 'భారత మూడో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆర్మీ దుస్తుల్లో అందుకోవడంతో నా సంతోషం పదిరెట్లు అయింది. మీ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి.. దేశ పౌరులు రాజ్యాంగ హక్కులను స్వేచ్చగా వినియోగించుకునేలా.. దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులందరికీ ధన్యవాదాలు. జైహింద్‌' అని పేర్కొన్నాడు.
సోషల్‌ మీడియా వేదికగా రాష్ట్రపతి కోవింద్‌, నరేంద్ర మోడీ, భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ధోనీ అభిమానులతో పంచుకున్నాడు. వీటికి బదులుగా అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'మీరు మాకెప్పుడు ఆదర్శమేనంటూ'.. కామెంట్‌ చేస్తున్నారు. ఆర్మీ డ్రెస్‌లో ఉన్న ధోని కూతురు జీవాకు ఆర్మీ క్యాప్‌ పెట్టి ఉన్న ఫొటోను ఈ పోస్ట్‌కు ట్యాగ్‌ చేశాడు. ఈ ఫొటో సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది.