చంద్రబాబు తుమ్మిదే అద్భుతం,దగ్గితే అద్భుతం...!

2018-04-03 1

YSR Congress Party MP Vijaya Sai Reddy satire on Andhrajyothi and Radharkrishna for supporting Telugudesam.

తాను ఆంధ్రజ్యోతి పత్రికకు సబ్ స్క్రైబ్ చేసుకొని నెల రోజులు అవుతున్నా, పత్రిక ఇవ్వడం లేదని, ఎందుకివ్వడం లేదో తెలియదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సభ వాయిదాపడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికపై మాట్లాడారు. రాధాకృష్ణ దేహంలో మొత్తం టీడీపీ రక్తం పారుతోందన్నారు. అయితే జర్నలిస్ట్ లేదా పత్రిక అందరికీ సమదూరం పాటించాలనే విషయం గుర్తించాలన్నారు. రాధాకృష్ణతో తనకు స్నేహం ఉందని, కానీ తీరు సరికాదన్నారు.
చంద్రబాబు తుమ్మితే అద్భుతంగా తుమ్మాడని, దగ్గితే ఇంతకన్నా అద్భుతంగా ఎవరూ దగ్గరని పేర్కొంటారని, ఇదేనా మీరు చేసేది అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. మీకు జర్నలిజం విలువలు ఉంటే సమతూల్యం పాటించాలని రాధాకృష్ణకు చెబుతున్నానని తెలిపారు.
పార్లమెంటులో అందరి చేతులు పట్టుకుని చంద్రబాబు బతిమిలాడుతున్నారని, ఆయనను ఎవరూ లెక్క చేయడం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబును కలవాలంటూ టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతలను వేడుకుంటున్నారన్నారు.తనను జైలుకు పంపించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. లోకేష్ జైలుకు వెళ్లడానికి పోలవరం, రాజధాని, భూస్కాం, తాత్కాలిక సచివాలయం, భూకేటాయింపులు, చంద్రబాబు విదేశీ పర్యటనలు, కాల్ మనీ సెక్స్ రాకెట్, హెరిటేజ్, అగ్రిగోల్డ్, ఓటుకు నోటు వంటి కేసులు చాలన్నారు.