Rangasthalam Team Arranges Thanks Meet

2018-04-03 2,073

Sukumar Emotional Speech about Ram Charan at Rangasthalam Thank You Meet on Mythri Movie Makers. #Rangasthalam 2018 Telugu Movie ft. Ram Charan, Samantha, Pooja Hegde and Aadhi Pinisetty.

రంగస్థలం చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. చిత్రానికి విశేషమైన స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. సోమవారం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ నిర్వహించారు. త్వరలో మరో ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాంచరణ్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని నేను సినిమాలను అంగీకరించను అని స్పష్టం చేశాడు.
సాధారణంగా నేను ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయను. నేనెప్పుడూ ఫ్యాన్స్ ఆలోచించి రంగస్థలం సినిమా ఒప్పుకోలేదు. సుకుమార్ చెప్పిన కథ విన్నాక నాకు బాగా నచ్చింది. ఏసీ రూమ్‌లో కథలు వింటాం. అవి మాకు నచ్చినప్పుడే అభిమానులు, తల్లిదండ్రులు గర్వపడే సినిమాలు వస్తుంటాయి.
రంగస్థలం సినిమా సక్సెస్ కారణమైన ప్రతీ ఒక్కరి గురించి నాకు చాలా చెప్పాలని ఉంది. కానీ త్వరలోనే సక్సెస్ మీట్ పెడుతున్నట్టు నిర్మాత నవీన్ గారు చెప్పారు. ఆ సభలో ప్రతీ ఒక్కరి గురించి నేను మాట్లాడుతాను అని రాంచరణ్ అన్నారు.
అంత పెద్ద స్టార్‌కు కొడుకై ఉండి కూడా ‘చెవిటి మెషీన్‌ పెట్టుకో డార్లింగ్‌' అంటే మరో మాట మాట్లాడకుండా పెట్టేసుకున్నాడు. ‘ఒకస్టార్‌ చెవిటి మెషీన్‌ పెట్టుకుంటే బాగుంటుందా? లేదా? అని ఆ టైమ్‌లో నాకే సందేహం' కానీ, చరణ్‌ను నేను మోసం చేశాను. నాకు నమ్మకం లేకుండానే చరణ్‌కు చెవిటి మెషీన్‌ ఇచ్చేశాను.
చిట్టిబాబు పాత్రలో చరణ్‌ తప్ప మరొకరిని ఊహించుకోలేను. అంత పెద్ద స్టార్‌కు కొడుకై ఉండి కూడా ‘చెవిటి మెషీన్‌ పెట్టుకో డార్లింగ్‌' అంటే మరో మాట మాట్లాడకుండా పెట్టేసుకున్నాడు. ‘ఒకస్టార్‌ చెవిటి మెషీన్‌ పెట్టుకుంటే బాగుంటుందా? లేదా? అని ఆ టైమ్‌లో నాకే సందేహం' కానీ, చరణ్‌ను నేను మోసం చేశాను. నాకు నమ్మకం లేకుండానే చరణ్‌కు చెవిటి మెషీన్‌ ఇచ్చేశాను. అయితే, చరణ్‌ నన్ను నమ్మి చెవిటి మెషీన్‌ పెట్టుకోవడం వల్లే ఆ పాత్రను కొనసాగించగలిగాను. ఈ విజయం చరణ్‌ది.

Free Traffic Exchange