Sai Dharam Tej Launches Sunrisers Hyderabad T Shirt

2018-04-02 54

sunrisers hyderabad team practice session starts hyderabad. Hero Sai Dharam Tej has launched Sunrisers T-Shirt in Hyderabad

ఐపీఎల్ 11వ సీజన్‌కు మరికొద్ది రోజులే ఉండటంతో ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరిపోయారు. ఇక, ప్రాంఛైజీలు సైతం ప్రాక్టీస్ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. తాజాగా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆదివారం తమ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ను నిర్వహించింది. అయితే, అనుకోకుండా వచ్చిన వర్షం కారణంగా ఆటగాళ్ల ప్రాక్టీస్ రద్దు అయింది.
ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. వర్షం కారణంగా ప్రాక్టీస్ రద్దు కావడంతో ఆటగాళ్లు ఇండోర్ స్టేడియంలో కసరత్తులు చేశారు. వార్మత్ అనంతరం ఆటగాళ్లంతా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌ తదితర విభాగాల్లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంతకముందు ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ధరించే జెర్సీని మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ ఆవిష్కరించారు. సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్వహించిన ఈ జెర్సీ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు. జెర్సీ ఆవిష్కరణ అనంతరం పలువురు అభిమానులకు జెర్సీలను అందించాడు. సాయిధరమ్ తేజ్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. గతంలో జరిగిన అనేక ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు తన మద్దతుని తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్‌రైజర్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఏప్రిల్ 9న జరగనున్న ఈ మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. సన్‌రైజర్స్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.