ఛల్ మోహన్ రంగ ప్రమోషన్ నిమిత్తం హీరో నితిన్ ఆదివారం వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ కార్యక్రమాల్లోపాల్గొన్న అనంతరం నితిన్ సింహాచలం వెళ్లి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నాడు. సినిమా విడుదల నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం నితిన్ ఆలయానికి వెళితే వింత అనుభవం ఎదురైంది. ఆలయంలో స్వామివారి ఉంగరం పోయిందని, ఆ సమయంలో నితిన్ అక్కడ ఉండడంతో అతడిపై నింద వేశారు. దీనితో నితిన్ బిత్తరపోయాడు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నితిన్ కు ఊరట లభించింది.