NTR all praises to Ram Charan For Rangasthalam success. Fan are happy with NTR tweets
రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ పై ఏక చత్రాధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వీకెండ్ ముగిసే సమయానికి రంగస్థలం చిత్రం ట్రేడ్ విశ్లేషకులని సైతం షాక్ కి గురిచేసేలా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
రంగస్థలం హవాతో టాలీవుడ్ లో పలు చిత్రాల గత రికార్డులన్నీ గతంగా మిగిలిపోతున్నాయి. ఖైదీ నెం 150 చిత్రం ఫుల్ రన్ లో సాధించిన యుఎస్ వసూళ్ళని రంగస్థలం చిత్ర కేవలం మూడు రోజుల్లోనే అధికమించడం విశేషం.
రంగస్థలం చిత్రానికి ముందు రాంచరణ్ దృవ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ధృవ చిత్రం ఫుల్ రన్ లో 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
రంగస్థలం విజయ గర్జన రీసౌండ్ తో బలంగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లుగా తనకు ఖైదీ చిత్రం తరహాలో రాంచరణ్ కు రంగస్థలం చిత్రం అవుతుంది అనే మాటలు అక్షరాలా నిజమయ్యాయి.
రంగస్థలం చిత్రంపై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించాడు. రంగస్థలం చిత్రం చూశాక ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. రాంచరణ్ కు హ్యాట్సాఫ్ అని తెలపడం అభిమానులని షాక్ కి గురిచేస్తోంది.
దర్శకుడు సుకుమార్ పై కూడా ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి కథ తెరకెక్కించాలని ధైర్యం కావాలని, సుకుమార్ బ్రిలియంట్ డైరెక్షన్ తనని ఆశ్చర్య పరిచిందని ఎన్టీఆర్ తెలిపాడు. సమంత, దేవిశ్రీ ప్రసాద్ మరియు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ పై కూడా ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించాడు.
సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత కూడా రాంచరణ్ ను కలసి రంగస్థలం విజయం సాధించడంతో ఓ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.