In the film, Ram Charan plays a hearing-impaired engineer and that talent brings him a lot of popularity in his village, Rangasthalam. Sukumar directorial, Music and background score, Sukumar’s story and direction.
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా 1980ల నాటి బ్యాక్ డ్రాపుతో పూర్తి పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాపై ఇంత పాజిటివ్ బజ్ రావడానికి ఐదు ప్రధాన కారణాలున్నాయి. ఆ 5 కారణాలు ప్రేక్షకుడికి కనెక్ట్ అయి సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాయి.
మనమంతా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ నగరాలు, పట్టణాల్లో సెటిలయ్యాం. అయితే మనలో అధిక శాతం మంది మూలాలు పల్లెటూరి నుండి వచ్చినవే. ఈ పాయింటును ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు సుకుమార్ సఫలం అయ్యాడు. ప్రస్తుతం యాంత్రిక జీవనం గడుపుతున్న చాలా మందికి ఈ చిత్రం ఒక మంచి రిలాక్సేషన్ ఇస్తుంది.