Veteran screenwriter Javed Akhtar today warned "bigots" to be wary of communalising the Indian film industry, which he termed as "the citadel of secularism".
భారతీయ సినిమా పరిశ్రమను మతం పేరుతో వర్గీకరించడానికి ప్రయత్నిస్తున్న సంకుచిత ఆలోచనాపరులపై ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండి పడ్డారు. అలా ప్రయత్నాలు చేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తూ ఇండియన్ సినీ పరిశ్రమ సెక్యూలరిజానికి కోటలాంది అని వ్యాఖ్యానించారు.
రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘మహాభారతం' సినిమా రావడంపై... ఇండియన్ బేస్డ్ ఫ్రెంచి జర్నలిస్ట్ ఫ్రాంకోయిస్ గ్వాటియర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అయిన అమీర్ ఖాన్... హిందువులు పూజించే కృష్టుడి పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతాడు? అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.... అతడికి కౌంటర్‌గా జావేద్ అక్తర్ ఈ కామెంట్స్ చేశారు. గ్వాటియర్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సినిమా రంగంలో మత విశ్వాసం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ఈ సందర్భంగా అక్తర్ కోరారు. భారతీయ చిత్ర పరిశ్రమ లౌకిక వాదానికి పెట్టని కోటలాంటిది. ఇలాంటి ఇండస్ట్రీని మతాల పేరుతో కలుషితం చేయవద్దు అని... సంకుచిత వాదులను జావేద్ అక్తర్ హెచ్చరించారు.
మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అమీర్ ఖాన్ గతంలో వెల్లడించారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ముఖేష్ అంబానీ సహనిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం తెరకెక్కబోతోందని ఓ బాలీవుడ్ పత్రిక పేర్కొంది.