Sai Pallavi Planning To Remove For Her Behaviour In Shanthanu Movie

2018-03-28 880

Actor Shanthanu Bhagyaraj, son of veteran filmmaker Bhagyaraj, on Wednesday took to Twitter to share a picture that also featured filmmaker Mysskin, lensman PC Sreeram and producer Ravindran Chandrasekhar and captioned it: “My new birth. Bless me”. Reports suggest that Samantha is on board in place of Sai Pallavi.

ప్రేమమ్‌తో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్న సాయిపల్లవి.. ఆ తర్వాత ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశారు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో నానితో కలిసి ఎంసీఏ చిత్రంలో నటించారు. తమిళంలో కణం సినిమాలో నాగశౌర్యతో నటించి మెప్పించారు. అయితే నటనపరంగా ఎలాంటి మచ్చలేని సాయిపల్లవిపై మరో రకమైన ఆరోపణలు రోజుల రోజుకు పెరిగిపోతున్నాయి.
ఎంసీఏ సినిమా సందర్భంగా నానితో వ్యక్తిగత అభిప్రాయ బేధాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే నాని ఓ దశలో సాయిపల్లవితో ఎలాంటి గొడవలు లేవు. నాతోపాటు నటించిన నా హీరోయిన్లలో సాయిపల్లవి మంచి ప్రతిభావంతురాలు. మా మధ్య గొడవలు వచ్చినట్టు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని నాని క్లారిటీ ఇచ్చారు.
ఇక కణం సినిమాలో నటించిన నాగశౌర్య.. సాయిపల్లవిపై బహిరంగంగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో విమర్శలు చేశారు. సాయిపల్లవి చాలా పొగరుగా వ్యవహరిస్తుంది. ఆమెతో నటించేటప్పుడు చాలా ఇబ్బందికి గురయ్యాను అని నాగశౌర్య అన్నారు. అంతేకాకుండా నేను ఎంతోమంది హీరోయిన్లతో నటించాను. కానీ ఆమె లాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని నాగశౌర్ పేర్కొన్నారు.
కెరీర్‌కు ఇబ్బందిగా మారే విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో సాయిపల్లవికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళంలో ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా కుమారుడు శంతను భాగ్యరాజా ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి, నిత్యమీనన్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే శంతను రూపొందించే చిత్రం నుంచి సాయిపల్లవిని తప్పించారనే న్యూస్ లేటేస్టుగా మీడియాలో వైరల్‌గా మారింది. సాయిపల్లవి స్థానంలో సమంత అక్కినేనిని తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ వార్తను అధికారికంగా ధృవీకరించిన దాఖలాలు కనిపించడం లేదు