Actress Jayanthi Admitted In Hospital

2018-03-27 637

Kannada Veteran Actress Jayanthi is suffering from Asthama. She has been admitted to Vikram Hospital, Bengaluru.

ప్రముఖ దక్షిణాది నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా అస్తమాతో బాధ పడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బెంగుళూరు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జయంతికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జయంతి వయసు 73 సంవత్సరాలు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో ఆమె నటించారు.చిన్న తనంలో తన అభిమాన నటుడు ఎన్టీ రామారావును చూసేందుకు ఆమె స్టూడియోలకు వెళ్లేవారు. అలా ఈ రంగంపై ఆసక్తి పెంచుకుని నటిగా మారారు.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో కలిపి వందల చిత్రాల్లో ఆమె నటించారు. కన్నడ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు.