Balakrishna To Launch NTR Biopic Very Soon

2018-03-27 109

Noted critic Taran Adarsh tweeted, "#NTR biopic launch on 29 March 2018 at Ramakrishna Studios, Hyderabad... NTR's son Balakrishna to enact the role of NTR in the film... Will be made in Hindi and Telugu... Directed by Teja... Produced by Balakrishna, Sai Korrapati and Vishnu Vardhan Induri... #NTRBiopic".

తెలుగుజాతి ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా త్వరలో బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనున్నారు. తేజా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం లాచింగ్ డేట్ ఖరారైంది. మార్చి 29, 2018న హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో ఈ సినిమాను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించనున్నారు
ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో ఏం చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే వివాదాల జోలికి పోకుండా నిమ్మకూరులో ఎన్టీఆర్ జీవితం ప్రారంభమైనప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన పరిణామాలను ఫోకస్ చేస్తూ రాజకీయాల వైపు సాగించిన ప్రయాణం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో సినిమా ముగింపు ఉంటుందని తెలుస్తోంది.
కాగా... ఈ సినిమాలో ఎన్టీ రామారావు భార్య బసవతారకం పాత్రను ఎవరు పోషించబోతున్నారు? అనేది చర్చనీయాంశం అయింది. ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి