Ajith Accepts New Movie To Replace Disaster Of "VIVEGAM"

2018-03-26 504

Producer K Rajan has revealed in an interview that Ajith's Vivegam was a dud at the box office. Hence Thala Ajith decided to work with the same production house on their upcoming action-thriller Viswasam, to help them recover the losses incurred due to the poor performance of Vivegam.

అజిత్ హీరోగా వచ్చిన 'వివేకం' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో చిత్ర నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. తమిళనాడులో పెద్ద స్టార్ హోదాలో ఉన్న ఆయన ఆ నష్టాన్ని పూడ్చడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని నిర్మాత కె రాజన్ స్వయంగా వెల్లడించారు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కె రాజన్ మాట్లాడుతూ...‘వివేకం' సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దీని వల్ల రూ. 50 కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాలను పూడ్చడానికే అజిత్ ‘విశ్వాసం' సినిమా చేస్తున్నారు అని తెలిపారు
ఈ సందర్భంగా కె రాజన్ దర్శకుల తీరుపై మండి పడ్డారు. దర్శకులు తాము ముందుగా చెప్పిన డేట్స్, ఫిక్డ్స్ బడ్జెట్‌లో సినిమాను పూర్తిచేయడంలో విఫలం అవుతున్నారని, దీని వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయని తెలిపారు.
విశ్వాసం సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా... కోలీవుడ్లో జరుగుతున్న స్ట్రైక్ కారణంగా ఇంకా మొదలు కాలేదు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి దిపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్.