Ram Charan Interview On Rangasthalam

2018-03-26 13,928

Tollywood Mega Power star Ram Charan about Director Sukumar and Rangasthalam movie. Rangasthalam is an upcoming Indian Telugu period revenge drama directed by Sukumar and produced by Y. Naveen, Y. Ravi Shankar and C. V. Mohan under the banner Mythri Movie Makers.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'.ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలతో రామ్ చరణ్ బిజీ అయ్యాడు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
బర్త్ డే దగ్గర్లో ఉన్నా ఎగ్జైట్మెంట్ లేదు ఏమీ లేదు. ఒక టెన్షన్ మాత్రమే ఉంది. బర్త్ డే సందర్భంగా ఎవరూ నా దగ్గరకు రాకండి, డైరెక్టుగా 30వ తేదీనే కలుస్తాను అని అందరికీ చెబుతున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశాం. నిజంగా చెప్పాలంటే ఇందులో నా వల్ల అయినంత బెస్ట్ ట్రై చేశాను..,. అని రామ్ చరణ్ తెలిపారు.
నేను ధృవ షూటింగ్ పైనల్ డేస్ లో ఉన్నపుడు సుకుమార్ గారు వచ్చి నన్ను కలిశారు. నేను అప్పుడు ఒకటే అడిగా... ఏం సుక్కు నాతో సినిమా చేయడానికి ఇన్ని రోజులు పట్టింది అని గట్టిగా అడిగాను... దీంతో ఆయన అయ్యో సారీ చరణ్ గారు, కుదరలేదు అని ఏదో చెప్పారు. పాపం ఆయన ఒక్కో సినిమా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అలా తీస్తా ఉంటారు. ఆ సమయానికి నేనూ ఖాళీగా లేను, ఆయన కూడా లేరు.... అని రామ్ చరణ్ తెలిపారు.
నాతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనగానే.... పల్లెటూరి బ్యాక్ డ్రాపుతో సినిమా చేద్దామనుకుంటున్నాను అన్నారు. నేను ఎన్నో సంవత్సరాలు ఉన్న విలేజెస్ ప్రాంతానికి సంబంధించి ఒక మంచి పొలిటికల్ డ్రామా, చేస్తావా? అంటే... స్టోరీ వినకుండానే చేస్తాను అని చెప్పాను. నెక్ట్స్ డే ఈవినింగ్ వచ్చి కథ చెప్పారు. ఫస్ట్ మాట నీకు చెవుడు అన్నాడు. క్యారెక్టరైజేషన్ ఒకే చెబితేనే నేను కథ చెబుతాను, లేక పోతే చెప్పను అన్నాడు. అదేంటి సుకుమార్ అంటే నువ్వు నన్ను నమ్ము 2 గంటల తర్వాత వేరే పాయింట్ ఆఫ్ వ్యూతో కథ నచ్చింది అంటావు అన్నారు. ఆయన అన్నట్లే నాకు కథ బాగా నచ్చింది అని... చరణ్ తెలిపారు.
సుకుమార్ మాట నమ్మి బ్లైండ్‌గా దూకేశాను, ఆ తర్వాత కథ నేరేషన్ మొదలైంది, అది విని మెస్మరైజ్ అయ్యాను, అలాంటి నేరేషన్ కానీ, అలాంటి స్క్రీన్ ప్లే నేను ఇంత వరకు వినలేదు అని రామ్ చరణ్ తెలిపారు. అలాంటి సబ్జెక్ట్ నాకు వచ్చినందుకు నా అదృష్టంగా భావించాను అని తెలిపారు.