Manchu Lakshmi Strongly Opposes Discrimination On Women

2018-03-26 1

Lakshmi Manchu serious over Telugu Television Channel Editor.Targeting actresses, will be least tolerated by our fraternity. I condemn this & won’t let this go easy. #GetALife than gaining publicity by speaking derogatorily towards the women of the industry.

ప్రత్యేక హోదా అంశంపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీతో చర్చా వేదికలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన మహిళలపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదమైంది. తెలుగు సినీ పరిశ్రమలోని తారలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన TV5 టెలివిజన్ చానెల్ ఎడిట‌ర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. శనివారం రాత్రి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షుడు శివాజీరాజా, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, ఝాన్సీ, హేమా, ప్రగతి, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వివాదంపై సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ స్పందించారు. చర్చ ఏదైనా మ‌హిళ‌ల‌ని జ‌న‌ర‌లైజ్‌, టార్గెట్ చేస్తూ ఎవ‌రూ మాట్లాడ‌రు. న‌టీమ‌ణుల‌ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నా కూడా ఎవ‌రు పెద్దగా ప‌ట్టించుకోరు. కానీ తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ని నేను ఖండిస్తున్నాను. దీనిని తేలికగా తీసుకోం. ఇండ‌స్ట్రీలోని మ‌హిళ‌ల గురించి అమ‌ర్యాద‌గా మాట్లాడి ప‌బ్లిసిటీ పొంద‌డం క‌న్నా నీచం మ‌రొక‌టి ఉండ‌దు అని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు.