వాస్తవాలు చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా.. అలా చెప్తే కేసులు పెట్టిస్తా అంటున్నారు.

2018-03-24 314

Andhra Pradesh CM Nara Chandrababu Naidu lashed out at PM Narendra Modi's Union government.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిధులను ఇతర పథకాలకు మళ్లించే అలవాటు కేంద్రానికి ఉందేమో గానీ తనకు లేదని చంద్రబాబు అన్నారు.
మన వద్ద పన్నులు వసూలు చేసుకుని రాయితీలు ఇవ్వరా అని చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇన్ని గొడవలు జరుగుతుంటే ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చి ఎపికి ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు.
తనకు ప్రజలే అధిష్టానమని చంద్రబాబు అన్నారు. కేంద్రంపై తాము జపాన్ తరహా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిజమైన కోఆపరేటివ్ ఫెడరలిజానికి టిడిపి ఆదర్శమని చంద్రబాబు అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు.
అధికారం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చననే పద్ధతిలో అమిత్ షా లేఖ రాశారని చంద్రబాబు అన్నారు. ప్రధాని కార్యాలయం ఏ విధంగా పనిచేస్తుందో దానికి ఇది ఒక ఉదారహణ మాత్రమేనని అన్నారు.
ఎపి రైల్వేకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని చంద్రబాబు అన్నారు. రాజధానికి 2500 కోట్లు విడుదల చేశామని అమిత్ షా చెప్పారని, అందులో నిజం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మున్సిపాలిటీలకు ఇచ్చారని, రాజధానికి కాదని అన్నారు.
గ్యాస్ ఆయిల్ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అదేదో ఎపికి సాయం చేస్తున్నట్లు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. అది ఇక్కడే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సౌరశక్తికి 800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చారని అన్నారు. అందులో ప్రత్యేకంగా ఎపికి ఇచ్చింది కాదని, అందరికీ ఇచ్చినట్లు మనకు ఇచ్చారని అన్నారు.
వారు మిమ్మల్ని వాడుకుంటున్నారా, మీకు వారు ఉపయోగపడుతున్నారా అనేది అమిత్ షా ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం విభేదించినప్పుడు సరి చేస్తే చేయండి, లేదంటే కాలమే సరి చేస్తుందని, కాలం ఎవరి కోసం ఆగదని అన్నారు. ఇన్న సమస్యలు ఉంటే ఒక్క పార్టీ మాట్లాడడం లేదని అన్నారు.