మోడీ ని కోర్టుకు లాగే ప్లాన్ లో చంద్రబాబు

2018-03-24 1

Andhra Pradesh CM and Telugu Desam Party (TDP) chief Chandrababu Naidu has decided to drag PM Narendra Modi’s government to court on the special category status issue.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంత దూరమైన వెళ్లడానికి ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కోర్టు తలుపులు తట్టేందుకు సిద్దపడుతున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై ఆయన పిటిషన్ వేస్తారని తెలుస్తోంది.
విభజన చట్టంలో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కుతారని అంటున్నారు.
కేసు దాఖలు చేయడానికి ఇప్పటికే అఫిడవిట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై తుది వరకు పోరాడే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోది. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్టంలోని హామీలు అమలు చేయించేలా చూడాలని ఆయన సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉది.
ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి తాను ఎందుకు అంగీకరించాననే విషయంపై కూడా చంద్రబాబు పిటిషన్‌లో వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రత్యేక హోదాను ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చిందో కూడా స్పష్టం చేస్తారని అంటున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు. దాన్ని పదేళ్లకు పొడగించాలని అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పట్టుబట్టారు. పైగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రస్తుత ప్రధాని మోడీ తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు.

Free Traffic Exchange