రంగం సిద్దం చేస్తున్న కాంగ్రెస్

2018-03-23 1

congress party leader Chinna Reddy said that if Tdp leader Ravula Chandrasekhar Reddy join in congress we will allot Makthal assembly seat. Chinna Reddy chit chat with media on Friday at Hyderabad.

తెలంగాణలో కీలకమైన టిడిపి నేతలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఆ పార్టీకి చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది.ఇప్పటికే తెలంగాణలో వలసలతో టిడిపి తీవ్రంగా నష్టపోయింది.టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి కీలకమైన టిడిపి నేతలు వలసలు వెళ్ళారు. 2019 ఎన్నికలకు తెలంగాణలో అన్ని రాజకీయపార్టీలు సిద్దమయ్యాయి. ఈ తరుణంలో టిడిపి నేతలపై కాంగ్రెస్ పార్టీ వల విసురుతోంది. అయితే కొందరు కీలక నేతలను తమ పార్టీల్లోకి చేరాలని సంప్రదింపులు జరుపుతోంది.
టిడిపి సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు మక్తల్ సీటు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు అవసరమని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు..
టిడిపి మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనిస్తున్నట్టు చిన్నారెడ్డి చెప్పారు. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు దయాకర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని చిన్నారెడ్డి ప్రస్తావించారు.
ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారిగా మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చెబుతున్నారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి గుర్తు చేశారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దఫా నాగర్‌కర్నూల్ నుండి నాగం‌కు మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.