బీజేపీతో వ్యభిచారం చేసింది తెలుగుదేశం : పవన్ కళ్యాణ్‌ కి కత్తి మహేష్ మద్దతు

2018-03-22 1

Cine critic Kathi Mahesh responded on Janasena's workers 'johar pawan kalyan' slogans.

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తరచూ విమర్శలు చేసే సినీ క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా జనసేన కార్యకర్తలకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలు జనసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ కనిపించారు.
ఓ కార్యకర్త మహాత్మాగాంధీ.. మహాత్మాగాంధీ అంటూ నినదించగా.. జై అంటూ తోటి కార్యకర్తలు నినాదాలు చేశారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.
ఆ తర్వాత ‘జోహార్ పవన్ కళ్యాణ్' అంటూ నినాదమిచ్చాడు. కార్యకర్తలు కూడా జోహార్ జోహార్ అంటూ నినాదాలు చెప్పారు. ఆ వెంటనే ఏదో తప్పు జరిగిపోయిందని నాలుక కరుచుకున్నారు. చనిపోయిన నేతకే జోహార్లు చెబుతారు అంటూ మరికొందరు కార్యకర్తలు వారిని వారించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాల్ వైరల్‌గా మారింది.
కత్తి మహేష్ కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ‘జోహార్ పవన్ కళ్యాణ్' ఏంట్రా నాయనా!' అని తనదైన శైలిలో స్పందించారు.
‘గ్లోబల్ టెర్రర్ విషయంలో అమెరికా అందర్నీ భయపెట్టేది. మీరు మాతో కలిసి రాకపోతే, మిమ్మల్ని కూడా టెర్రరిస్టులుగా పరిగణిస్తాం అని. అదే పద్దతి తెలుగుదేశం అవలంభిస్తోంది. మాతో లేకపోతే మీరు బీజేపీ ఏజంట్లు అని. బీజేపీతో వ్యభిచారం చేసింది మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని జగన్‌ని అంటే ఎట్లా!' అని కత్తి వ్యాఖ్యానించాడు.
విభజన హామీలు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే లేవు. తెలంగాణాలో కూడా ఉన్నాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్/ఖాజీపేట్ రైల్వె కోచ్ ఫ్యాక్టరీ లాంటి హామీలు తెలంగాణాకు ఉన్నాయి. కాబట్టి అన్ని హామీల కోసం తెలుగువాళ్లు ఏకం అవ్వాల్సిందే! కేంద్రప్రభుత్వంతో పోరాడాలసిందే' అని కత్తి స్పష్టం చేశారు.