Zuckerberg said today that Facebook has a responsibility to protect its users data. Facebook has already taken the important steps to prevent such a situation from happening again.
ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఎట్టకేలకు నోరు విప్పారు. సుమారు 5 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారం లీకైందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ విషయమై జుకర్ బర్గ్ స్పందించారు. డేటా లీక్ వ్యవహరంలో తప్పైందంటూ ఆయన అంగీకరించారు. అయితే అదృష్టవశాత్తు ఇప్పటికే డేటా రక్షణకు సంబంధించి చర్యలు తీసుకొన్నామని ఆయన వివరణ ఇచ్చారు.
కేంబ్రిడ్జి ఎనలిటికా సంబంధించి కొంత అప్‌డేట్ ఇవ్వదల్చుకొన్నానంటూ జుకర్ బర్గ్ తన ఫేసుబుక్ పేజీలో ఈ విషయమై వివరణ ఇచ్చారు. ఇప్పటివకే సంస్థ తీసుకొన్న పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. ఇలాంటి ఘోరమైన తప్పిదం జరిగిందని హమీ ఇస్తున్నామన్నారు.
భవిష్యత్తులో ఈ రకమైన చర్యలు జరగకుండా చర్యలు తీసుకొంటామన్నారు. యూజర్ల డేటా రక్షించడం మా ప్రధాన బాధ్యతగా ఆయన పేర్కొన్నాడు. అలా చేయకపోతే తమ సంస్థ యూజర్ల విశ్వాసాన్ని కోల్పోతోందని జుకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
రెగ్యులేటరీ, విచారణాధికారులతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇంత కాలం సంస్థ మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు జుకర్ బర్గ్ తెలిపారు సమస్య పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టొచ్చన్నారు. కానీ, ఇంతకంటే మెరుగైన సేవలతో ముందుకు రానున్నట్టు జుకర్ బర్గ్ ప్రకటించారు.ఫేస్‌బుక్ ఇప్పటివరకు తీసుకొన్న చర్యలపై జుకర్ బర్గ్ వివరాలను తన పోస్ట్‌లో పేర్కొన్నారు.