సల్మాన్ ఖాన్ సినిమాలో హాలీవుడ్ స్టార్?

2018-03-22 106

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా త్వరలో 'రేస్ 3' చిత్రం రాబోతోంది. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా బయట పెడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ మెయిన్ మ్యాన్‌ అని చెబుతూనే మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు ఈ కండల వీరుడు. హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టోలెన్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారు. సిల్వెస్ట్ స్టోలెన్ వీడియో పోస్టు చేస్తూ 'ఈ వారం మీకు 'రేస్ 3' ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నాను' అని సల్మాన్ ట్వీట్ చేయడంతో ఈ చిత్రంలో సిల్వెస్టర్ స్టోలెన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.