మళ్ళీ తెలుగోడి సత్తా చాటిన బాహుబలి...!

2018-03-21 1,126

After a long delay, there is some information on the China release of Baahubali 2. The movie has been certified by the censor board in China. Hollywood's Variety website has reported that E Stars Media will release the movie in the country.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'బాహుబలి-2' చిత్రానికి అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'దంగల్' చిత్రానికి మధ్య బాక్సాఫీస్ వార్ ఇంకా ముగియలేదు. అత్యధిక కలెక్షన్లతో నెం.1 స్థానంలో ఉన్న 'దంగల్' చిత్రాన్ని రెండోస్థానంలోకి తొక్కేయడానికి మరో అవకాశం దక్కింది మన తెలుగు చిత్రానికి.
‘బాహుబలి-2' చిత్రం ఇప్పటికే చైనాలో విడుదలవ్వాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆలస్యం అయింది. హాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రకారం బాహుబలి-2' చిత్రం ఇటీవల చైనాలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, ఈస్టార్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని చైనా వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
అయితే ‘బాహుబలి-2' చిత్రం చైనాలో ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. బాహుబలి తొలి భాగం చైనాలో పెద్దగా వర్కౌట్ కాలేదు... దంగల్, భజరంగీ భాయిజాన్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం కంటే తక్కువే కలెక్ట్ చేసింది. అయితే ‘బాహుబలి-2' మంచి వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-2' చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీసు వద్ద రూ. 1713 కోట్లు రాబట్టింది. దంగల్ సినిమా రికార్డును బద్దలు కొట్టాలంటే చైనాలో రూ. 150 కోట్ల మార్కును దాటితే చాలు. చైనాలో బాహుబలి-2 వసూళ్లు బావుంటే రూ. 2000 కోట్ల మార్కును అందుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే రూ. 2వేల కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ చిత్రంగా ‘బాహుబలి-2' రికార్డులకెక్కడం ఖాయం.