India vs Bangladesh : Dinesh Karthik Credits This Cricketer

2018-03-21 68

I would not be where I am without Abhishek Nayar,” Dinesh Karthik said. Working with him is an ongoing process. We discuss a lot about the game.

క్రికెట్‌ ఆడటం నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం. హఠాత్తుగా ఇంత గుర్తింపు రావడం గొప్పగా అనిపిస్తోంది. అయితే ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి ఇది మంచి ఆరంభం అనుకుంటున్నా' అని చెప్పాడు. రెండేళ్ల కిందట ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నపుడు తనకు అండగా నిలిచి, శిక్షణ ద్వారా తాను మెరుగుపడేందుకు కృషి చేసిన ముంబై ఆటగాడు అభిషేక్‌ నాయర్‌పై కార్తీక్‌ ప్రశంసలు కురిపించాడు.
‘గత రెండేళ్లలో నా కెరీర్‌ ఎదుగుదలలో అతడి పాత్ర ఎంతో కీలకం. మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యే విషయంలో నాయర్‌ నాకు సాయం చేశాడు. వ్యూహాల విషయంలో ఆలోచించేలా చేశాడు. శ్రమించడానికి సరైన మార్గమేంటో అతడికి తెలుసు. ఈ ప్రయాణంలో అతను నది అయితే.. నేను పడవ అని చెప్పొచ్చు' అన్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో బంతులు వృథా చేసి విమర్శలెదుర్కొన్న విజయ్‌ శంకర్‌కు కార్తీక్‌ అండగా నిలిచాడు. అతను ప్రతిభావంతుడని చెప్పాడు. ‘శంకర్‌కు నైపుణ్యం ఉంది. బౌలర్‌గా అతను చక్కటి ప్రదర్శన చేశాడు. ఒత్తిడిలో అతను బాగానే ఆడాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడిది ప్రత్యేకమైన ప్రతిభ. శంకర్‌ చాలా కాలం ఆడతాడు'' అన్నాడు. తన కంటే ముందు శంకర్‌ను బ్యాటింగ్‌కు పంపిన రోహిత్‌ శర్మకు కూడా కార్తీక్‌ మద్దతిచ్చాడు.
‘కెప్టెన్‌గా రోహిత్‌ మూడు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచాడు. తన సామర్థ్యంపై, జట్టును నడిపించే విషయంలో రోహిత్‌కు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ప్రతి మ్యాచ్‌కు ముందు రోహిత్‌ ఎన్నో వ్యూహాలు రచిస్తాడు. అతను తిరుగులేని కెప్టెన్‌' అన్నాడు.