నందమూరి ఫ్యాన్స్ కి అయన అంటే ఎందుకు అంత భయం?

2018-03-21 869

Nandamoori fans Feeling insecure for Trivikram's new movie

ఈ ఏడాది రాబోతున్న చిత్రాలలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ప్రతిష్టాత్మకమైనది. తొలిసారి వీరి కలయికలో చిత్రం రాబోతోంది. కుటుంబ కథా చిత్రాలకు తన మాటల మాయాజాలాన్ని జోడించి అలరించడం త్రివిక్రమ్ శైలి. అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందినప్పటికీ త్రివిక్రమ్ పై నందమూరి అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తి కరమైన చర్చ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జరుగుతోంది.
ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండడం ఇదే తొలిసారి.
ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్ మాటలతోనే కట్టిపడేయగలడు. దీనితో వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఘనవిజయం ఖాయం అని ఎన్టీఆర్ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ తన మేకోవర్ ని మార్చుకుంటున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ జిమ్‌లో కండలు తిరిగేలా కసరత్తులు చేస్తున్న ఫొటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ కసరత్తు త్రివిక్రమ్ కోసమే అని అంటున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే క్రేజీ ఆఫర్లని అందుకుంటోంది. అందులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

Videos similaires