India vs Bangladesh : Dinesh Karthik Made Every Indian Proud

2018-03-20 288

Dinesh Karthik's breathtaking knock in the final of the 2018 Nidahas Trophy won hearts the world over. Pallikal took to Instagram on Monday to share her happiness after her husband's heroics

భారత్, బంగ్లాదేశ్‌ల టీ20 మ్యాచ్ అంటే గుర్తుకొచ్చే విషయం అదేనేమో.. అనే స్థాయిలో భారీ సిక్సు కొట్టి అందరి హృదయాలను గెలుచుకున్నాడు దినేశ్ కార్తీక్. ఆదివారం కొలంబో వేదికగా భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో టీ20 ట్రైసిరీస్ ఫైనల్ పోరులో తలపడింది. మ్యాచ్ ముగిసే సమయం ముందు తీవ్ర ఒత్తిడి.. ఉత్కంఠ అలాంటి సమయంలో అసాధారణ నైపుణ్యంతో అత్యుత్తమ టైమింగ్‌ను ప్రదర్శించాడు దినేశ్ కార్తీక్. ఆఖరి వరకూ సందిగ్ధంగా నడిచిన మ్యాచ్‌ను భారత, బంగ్లా అభిమానులు ఉత్కంఠతో వీక్షించారు. ఫైనల్లో ఐదు పరుగుల లక్ష్యానికి ఆఖరి బంతిని సిక్సు కొట్టి బంగ్లాపై గెలిచిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఆకర్షించింది. అందరితో పాటుగా దినేశ్ కార్తిక్ భార్య దీపికా పల్లికల్ కూడా లైవ్ మ్యాచ్‌ను ఎంతో ఉత్కంఠతతో ఆస్వాదించిందట.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు కార్తిక్ సంచలన ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించారు. వారితో పాటుగా మ్యాచ్‌ను వీక్షించిన కార్తిక్ సతీమణి దీపికా పల్లికల్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా స్పందించారు.
మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసి.. 'భార్యగా గర్వపడుతున్నా అని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో కార్తిక్ కనిపిస్తుండగా తన పెట్ డాగ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ 'మై దాదా..మై సూప‌ర్‌ హీరో' అని క్యాప్షన్ కూడా పెట్టింది. స్క్వాష్ ప్లేయ‌ర్ అయిన దీపికా అంత‌ర్జాతీయ స్థాయిలో స‌త్తాచాటి ఎన్నో ప‌త‌కాలు సాధించింది.