India vs Bangladesh : Dinesh Karthik 29 Runs Off 8 Balls Because Of Me

2018-03-20 1

In a heart-touching post on his official Facebook page, pacer Rubel has revealed he is gutted after his team came so close to beating India in the final on Sunday night before they choked with India sealing a last-ball win.

'ఇది అస్సలేం బాగాలేదు. మేము మంచి ముగింపు ఇవ్వలేకపోయాం. ఇంతటి స్కోరు రావడానికి నేనూ కారణం అయి ఉండొచ్చు. ఇలా జరుగుతుందనుకోలేదు. నన్ను మన్నించండి.' ఇలా తనను మన్నించమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులను కోరుతున్నాడు బంగ్లా బౌలర్ రూబెల్ హుస్సేన్. శ్రీలంక వేదికగా జరిగిన భారత్, బంగ్లాల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో మ్యాచ్ దశ తిరిగిపోయింది. దీనికి కారణం దినేశ్ కార్తీక్ సంచలన బ్యాటింగ్. విజయం అంచుల వరకు వచ్చిన బంగ్లా.. రుబెల్ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ 22 పరుగులు రాబట్టడంతో గెలుపు ఆశలు ఆవిరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమను క్షమించాలంటూ భావోద్వేగంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరాడు.
ఈ ట్వీట్‌కు స్పందించిన బ్రెట్ లీ 'తల ఎత్తుకుని తిరుగు. నువ్వేం బాధపడాల్సిన అవసర్లేదు. నీ జట్టు గర్వించేలా ఆడావ్.' అంటూ ట్వీట్ చేశాడు. అసలు ఆ 19వ ఓవర్లో.. కేవలం 8 బంతుల్లో 29 పరుగులు సాధించి అజేయంగా నిలిచిన కార్తీక్ భారత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. దాంతో దినేశ్ కార్తీక్ సంపాదన, క్రేజ్ అన్నీ ఒకే ఒక్క ఓవర్‌తో పెరిగిపోయాయి. ఈ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ఆటతీరుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సైతం పొందాడు. దీంతో బంగ్లాదేశ్‌పై ఓటమనేది లేకుండా వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచి కొత్త రికార్డును కొనసాగిస్తోంది. ఇలా టీ 20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఒకే ప్రత్యర్థిపై ఓడిపోకుండా వరుసగా విజయాలను నమోదు చేసుకున్న జట్టుగా భారత్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పాకిస్థాన్ దక్కించుకుంది

Free Traffic Exchange