సల్మాన్ ఖాన్ ఆ హీరోయిన్ ని పట్టించుకోవట్లేదా ?

2018-03-20 19

Pooja Dadwal, who has starred with Salman Khan in the Veergati, is grievously ill and is financially so hard up that she has no money to even pay for her medical expenses

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. టీబీ వ్యాధితో ఆసుపత్రిలో చేరి వైద్యానికి కూడా డబ్బులేని దీనమైన స్థితిలో సతమతం అవుతోంది. ఆమె పేరు పూజా దద్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా 1995లో వచ్చిన 'వీర్‍‌గాటి' చిత్రంలో నటించింది. ఈ సినిమా అప్పట్లో సల్మాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ముందు వరకు చేతి నిండా అవకాశాలున్న పూజా దద్వాల్.....'వీర్‍‌గాటి' ప్లాపుతో అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైంది.
తాను తీవ్రమైన టీబీ వ్యాధితో బాధ పడుతున్నానని, వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవని, సల్మాన్ ఖాన్ సహాయం కోసం ప్రయత్నాలు చేశానని, ఆ ప్రయత్నాలు ఫలించలేదని, మీడియా ద్వారా అయినా తన పరిస్థితి గురించి సల్మాన్‌కు తెలిస్తే సహాయం చేస్తాడని ఆశిస్తున్నానని. ఆసుపత్రిలో చేరి 15 రోజులైందని, ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని, ఒక కప్పు టీ తాగడానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది అని పూజా దద్వాల్ తెలిపారు.
ఆసుపత్రి బిల్స్ కట్టడానికి తనకు ఎవరైనా సహాయం చేయాలని ఆమె మీడియా ద్వారా వేడుకుంటోంది.పూజా దద్వాల్ టీబీ వ్యాధితో బాధ పడుతోందనే విషయం తెలిసి ఆమె భర్త, అత్తమామలతో పాటు ఇతర బంధువులు ఆమె దూరం పెట్టారట.
ప్రస్తుతం పూజా దద్వాల్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని, రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆమెకు సరైన వైద్యం అందకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని అంటున్నారు.
సినిమాల్లో అవకావాలు లేక పోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టిన పూజా కొన్ని సంవత్సరాలుగా గోవాలో క్యాసినో మేనేజ్మెంట్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూనే జీవనం సాగిస్తున్నారు.
ప్రస్తుతం పూజా దద్వాల్ తనకు సహాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ లేదా ఇతర బాలీవుడ్ ప్రముఖులెవరైనా ఆమె ఆరోగ్య పరిస్థితి విషయమించక ముందు సహాయం చేసి ఆదుకుంటారని ఆశిద్దాం.