శ్రీదేవి పై జాతీయ జెండా కప్పాల్సిన అవసరం ఏముంది : నరేంద్ర మోడీ ప్లాన్

2018-03-20 581

Raj Thackeray questions Why Bollywood actress Sridevi was given a state last rites, asking “What did she do for the country that her body was wrapped in the tricolour?. Also taking a dig at Akshay Kumar and his films Toilet: Ek Prem Katha and PadMan.

అతిలోక సుందరి శ్రీదేవి మృతి వార్త ఎదో విధంగా ఇప్పటికి వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాగా శ్రీదేవి పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడంతో ఆమె అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణసేన అధ్యక్షుడు రాజ్ థాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
శ్రీదేవికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని రాజ్ థాక్రే అన్నారు. శ్రీదేవి దేశం కోసం ఏం చేసిందని ఆమెపై త్రివర్ణ పతాకాన్ని కప్పారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గండి కొట్టి, పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాములో ఇరుక్కున్న నిరవ్ మోడీ వార్తలని ప్రసారం చేయకుండా మీడియా మొత్తం శ్రీదేవి మృతికి ప్రాధాన్యత కల్పించడంలో అర్థం ఏమిటని రాజ్ థాక్రే అన్నారు.
నీరవ్ మోడీ వార్తలు ప్రసారం అయితే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతోనే నరేంద్ర మోడీ మీడియాపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు. అందుకే మీడియా నీరవ్ మోడీ విషయాన్ని పక్కన పెట్టి శ్రీదేవి మృతికి అధిక ప్రాధాన్యత కల్పించారని అన్నారు.
ఇక రాజ్ థాక్రే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని కూడా వదల్లేదు. అక్షయ్ కుమార్కి , మోడీ ప్రభుత్వానికి రహస్య ఒప్పందాలు ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసారు. అక్షయ్ కుమార్ చేస్తున్న చిత్రాలు మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మాన్ చిత్రాలు అలాంటివే అని ఆరోపించారు.