AIADMK chief VK Sasikala's husband M Natarajan lost life at a hospital in Chennai after multiple organ failure. The 74-year-old was admitted to Gleneagles Global Health City
గత కొంతకాలంగా కిడ్నీ సంబధిత సమస్యలతో బాధపడుతున్న వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ (74) సోమవారం అర్ధరాత్రి దాటాక ఆసుపత్రిలో కన్నుమూశారు. గతేడాది అక్టోబరులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న ఆయన.. రెండు వారాల క్రితం అనారోగ్యంతో చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.భర్త ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సోమవారం రాత్రే శశికళకు సమాచారం అందించారు. దీంతో జైల్లోనే ఆమె బోరున విలపించినట్టు తెలుస్తోంది. భర్త కడసారి చూపు కోసం ఆమె పెరోల్ దరఖాస్తు చేసుకున్నారు. నటరాజన్‌ను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని గ్లోబల్ హెల్త్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షణ్ముగ ప్రియన్ తెలిపారు. ఆయన ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని గ్లోబల్ హెల్త్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షణ్ముగ ప్రియన్ తెలిపారు.
1975లో శశికళను వివాహం చేసుకోవడానికి ముందు నటరాజన్ పీఆర్వోగా పనిచేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జయలలితకు రాజకీయ సలహాదారుగానూ పనిచేశారు. భర్త నటరాజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియడంతో శశికళ సోమవారం పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ఆయన మరణవార్తతో కన్నీటి పర్యంతమయ్యారు.