India vs Bangladesh : Dinesh Karthik Emulates Dhoni With Last Ball Win

2018-03-19 395

India vs Bangladesh : Dinesh Karthik remembers MS Dhoni by propelling India to last-ball win over Bangladesh and clinch Nidahas Trophy tri series.

కొలంబో వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆతురతతో ఎదురుచూసిన భారత అభిమానులకు సంతృప్తిని మిగిల్చాడు దినేశ్ కార్తీక్. చివరి బంతికి విజయానికి 5 పరుగులు అవసరమైన స్థితిలో దినేశ్ కార్తీక్ సిక్స్ బాది జట్టును గెలిపించాడు.
రెండు ఓవర్లు మిగిలి ఉండగా భారత్ 34పరుగులు చేయాల్సి ఉంది. సరిగ్గా ఇదే పరిస్థితిలో క్రీజులోకి వచ్చాడు దినేశ్ కార్తీక్. రావడంతోనే తొలి బంతిని సిక్స్‌గా మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ ఓవర్లో 22 పరుగులు పిండుకున్న కార్తీక్.. ప్రతి బాల్‌ను చాకచక్యంగా ఎదుర్కొన్నాడు. మిగిలి ఉంది రెండే బాల్‌లు ఆ సమయంలో విజయ్ బౌండరీకి పంపబోయిన బాల్ క్యాచ్ ఇచ్చాడు.
దాంతో వికెట్ కోల్పోయిన భారత్‌కు ఇంకా ఒక్క బాల్ మాత్రమే మిగిలి ఉంది. కానీ, ఐదు పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో తుది బంతిని సిక్స్‌ బాది ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.
బంగ్లాదేశ్ ఆఖరి బంతికి విజయం వాకిట తలవాల్చింది. గతంలోనూ ఇదే తరహా ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చివరి బంతికి ఓటమికి గురైంది. 2016లో బెంగళూరులో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 146/7కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ విజయం దిశగా సాగింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లా జట్టు గెలిచినట్లే.
హార్దిక్ పాండ్య విసిరిన చివరి ఓవర్ మొదటి బంతికి మొహమ్మదుల్లా సింగిల్ తీయగా.. రెండు, మూడు బంతులను ముస్తాఫికర్ రహీమ్ బౌండరీకి తరలించాడు. బంగ్లా విజయానికి మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరం. ఈ దశలో భారీ షాట్లకు యత్నించిన ముస్తాఫికర్, మహ్మదుల్లా వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో బంగ్లా విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి.
ఒక్క పరుగు చేస్తే మ్యాచ్ టైగా ముగిసే అవకాశం. దీంతో ధోనీ, నెహ్రా కలిసి బంతి ఎక్కడ విసరాలో పాండ్యకు చెప్పి ఫీల్డింగ్ సెట్ చేశారు. క్రీజ్‌లోకి వచ్చిన షువగట పాండ్య విసిరిన బంతిని షాట్ ఆడేందుకు యత్నించి విఫలమయ్యాడు. కానీ సింగిల్‌ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని ముస్తాఫిజుర్ రహ్మాన్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ధోనీ బౌలర్ బంతి విసరక ముందే కుడి చేతి గ్లోవ్ తీసి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. ధోనీ రనౌట్ చేయడంతో ఒక్క పరుగు తేడాతో బంగ్లా అనూహ్యంగా ఓడగా.. భారత్ సంబరాల్లో మునిగిపోయింది.

Free Traffic Exchange