అవిశ్వాసం తీర్మానం చర్చ : మహిళ వేషధారణలో టీడీపీ ఎంపీ, రేణుకా చౌదరి మద్దతు

2018-03-19 445

Chittoor mp Siva prasad variety protest in front of parliament on monday. He was dress up like woman. tdp mps protest against dharna gandhi statue at parliament.

అవిశ్వాసం తీర్మానం ఇచ్చినప్పటికీ దానిపై చర్చకు కేంద్ర ప్రభుత్వం పారిపోతోందని టీడీపీ ఎంపీలు సోమవారం మండిపడ్డారు. నాలుగేళ్లుగా ఏపీకి అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి పబ్బం గడిపారన్నారు. టీడీపీ ఎంపీలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ రోజు టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులతో కేంద్రం మాట్లాడి సభ సక్రమంగా జరిగేలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సభ జరగకుండా స్పీకర్‌, కేంద్రం మ్యచ్ ఫిక్సింగ్ చేసినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఆందోళన చేస్తున్న ఎంపీలతో చర్చించి సభ జరిగేలా చేయడం ప్రభుత్వానికి చేతకాదా అని ప్రశ్నించారు. అయితే పార్లమెంట్ ఆవరణలో టిడిపి సభ్యుల ఆందోళనలకు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మద్దతును ప్రకటించారు. రాష్ట్ర హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా తాము పోరాటం చేస్తున్నామని రేణుకా చౌదరి చెప్పారు. ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
అదే సమయంలో మహిళ వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన తెలిపారు. శివప్రసాద్‌కు రేణుకా చౌదరి మద్దతుగా నిలిచారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళల తరపున తాను మహిళల వేషధారణలో నిరసన వ్యక్తం చేసినట్టు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏపీ మహిళలు ఆందోళనలు నిర్వహిస్తారని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు లాంటి నేతకు ద్రోహం చేస్తే పుట్టగతులుండవని శివప్రసాద్ చెప్పారు.

Free Traffic Exchange

Videos similaires