Famous astrologer sensational comments on Sridevi loss .In past He also made comments on Rajinikanth
శ్రీదేవి మృతి చెంది దాదాపు నెల కావస్తున్నా ఆమె గురించి మీడియాలో ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. శ్రీదేవి ఎలా మరణించారనే విషయంలో క్లారిటీ లేకపోవడమే దీనికి కారణం. ప్రముఖ జోతిష్యుడు ములుగు వరప్రసాద్ శ్రీదేవి మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
శ్రీదేవి పరాయి దేశంలో సంచలన పరిస్థితుల మధ్య మృతి చెందారు. శ్రీదేవి బాత్ టబ్ లో మృతి చెందడానికి కారణాలు, అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి స్పష్టంగా ఎవరికీ తెలియదు. శ్రీదేవి మృతికి సంబంధించిన పూర్తి వివరాలని ఆమె కుటుంబ సభ్యులు బహిర్గతం చేయలేదు.
శ్రీదేవి మృతి విషయంలో అభిమానులకు ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. అందువలనే ఇన్ని అనుమానాల కలుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో శ్రీదేవి ఆత్మ హత్య చేసుకున్నారా లేకా హత్య చేసారా అనే అనుమానాలు కూడా కలిగాయి.
దుబాయ్ ఫోరెన్సిక్ నివేదికలో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పది మృతి చెందినట్లు తేల్చారు. ప్రముఖ రాజకీయ నాయకుడు ఆ సమయంలో శ్రీదేవి మృతి హత్యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఉగాది సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యుడు ములుగు వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీదేవి మృతి ముమ్మాటికీ హత్యే అని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవిని ఆమె సన్నిహితులే హత్య చేసారని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.