బాలయ్య పవన్ ని అంత మాట అన్నాడా?

2018-03-17 912

Hindupur MLA and Tollywood Hero Nandamuri Balakrishna did not responded on Janasena chief Pawan Kalyan comments on chandrababu and lokesh.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు కూడా అదే స్థాయిల్ పవన్‌ను ఏకిపారేస్తున్నారు.
అయితే, పవన్ వ్యాఖ్యలపై ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం స్పందించలేదు. బాలకృష్ణ శనివారం హిందూపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. బాలకృష్ణ అందుకు నిరాకరించారు. ‘ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు.. నేనే సూపర్ హీరో' అని అన్నారు. గతంలోనూ పవన్ గురించి స్పందించమని అడిగితే బాలయ్య ఇదే విధంగా సమాధానమివ్వడం గమనార్హం.
పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చ జరగకపోతే... చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు. తనకున్న ఇమేజ్‌ను ఉపయోగించుకోవడానికి చంద్రబాబుకు ఇదే సరైన సమయమని ఉండవల్లి అన్నారు. అవిశ్వాసాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా... ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పారు.
వాస్తవానికి జనసేన అధినేత పవన్ వల్లే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని ఉండవల్లి తెలిపారు. బీజేపీతో పవన్ కుమ్మక్కయ్యారనేది అవాస్తవమని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పవన్ నిరాహారదీక్ష చేపడితే... మంచి ప్రచారం వస్తుందని తెలిపారు

Free Traffic Exchange

Videos similaires