Dhoni doesn't involve much and only when a bowler is really thrown into a corner he takes over. He will give you challenges and let you be in your space to understand them said bowling coach Balaji
భారత జట్టు మాజీ కెప్టెన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. దశాబ్ద కాలంగా బౌలర్లలో ఇంత ప్రతిభ కనబడిందంటే అది ఖచ్చితంగా కెప్టెన్‌గా ధోనీ అనుసరించిన పద్ధతేనని ఆయన పేర్కొన్నాడు. ఒక బౌలర్‌కు ధోనీ ఇచ్చినంత స్వేచ్ఛను మరే కెప్టెన్ ఇవ్వడని తెలిపాడు. జట్టులోనే కాదు డ్రెస్సింగ్ రూమ్ లోనూ చక్కటి వాతావరణాన్ని నెలకొల్పి జట్టు మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సహకరిస్తాడని వివరించాడు.
'సాధారణంగా మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ బౌలర్లని కదపడు. వారికి కావాల్సినంత స్వేచ్చ ఇచ్చి బౌలింగ్ చేయమంటాడు. కానీ.. బౌలర్ లయ తప్పుతుంటే మాత్రం.. చిన్నపాటి సూచనలతో మొదలెట్టి.. అవసరమైన సలహాలు ఇస్తాడు. అంతేగానీ.. బౌలర్ నుంచి సామర్థ్యానికి మించిన ప్రదర్శనని రాబట్టుకోవాలని ఆరాటపడడు. ధోనీ లాంటి గొప్ప కెప్టెన్ సారథ్యంలో బౌలర్లు చాలా విషయాలు నేర్చుకోవచ్చు' అని బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వివరించాడు.
ఏప్రిల్ 7న ముంబయి ఇండియన్స్‌తో టోర్నీ తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ప్రస్తుతం జట్టుని సిద్ధం చేసే పనిలో ఉన్న బాలాజీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ కెప్టెన్సీ గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు.