Chandrababu Naidu said that he was came out from NDA for the interests of Ap. He addressed in legislative council on Friday.Why Modi not discussed with alliance party about protest in parliament sessions asked Chandrababunaidu.
రాష్ట్రానికి న్యాయం చేయకుండా కేంద్రం తీవ్రమైన అన్యాయానికి పాల్పడిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రం డొంక తిరుగుడు సమాధానం చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొన్నాకే కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. శాసనమండలిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తన ప్రసంగంలో చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.
రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేస్తోంటే ప్రధానమంత్రి ఏం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న టిడిపి ఎంపీలు ఎందుకు ఆందోళన చేస్తున్నారనే విషయమై ఎందుకు మాట్లాడలేదని బాబు ప్రశ్నించారు.
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రత్యేక హోదా ఆలస్యం అవుతోందని ఉద్దేశ్యంతో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకొన్నట్టు చెప్పారు. కానీ, నాలుగేళ్ళుగా కేంద్రం రాష్ట్ర విభజన బిల్లును అమలు చేయలేదన్నారు. రాష్ట్ర డిమాండ్లపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తెలుగు సెంటిమెంట్ అంటే అంత చులకన అని బాబు ప్రశ్నించారు.
ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత తనపై ఎదురుదాడి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాను అసమర్ధుడినని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.