The actor will return to work only after the doctor gives the green signal. Director Vishal Bharadwaj recently revealed on social media that the ongoing shoot of his film Sapna Didi came to a grinding halt due to the health issues of both the Deepika Padukone and Irrfan Khan.
నిన్న గాక మొన్ననే కదా.. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలియగానే హీరోయిన్ దీపికా పదుకొణే అతనికి అండగా నిలబడింది. అంతలోనే ఇలాంటి వార్తా?.. దీపికా పదుకొణే సైతం ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుందన్న విషయం అభిమానులను కలచివేస్తోంది. ఆ కారణంగా షూటింగ్స్ కూడా రద్దు చేసుకుని ఇంటి పట్టునే ఉంటోందట దీపికా.
బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. దీపికా విటమిన్-3 లోపంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో షూటింగ్స్ చేయడం మంచిది కాదని, పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారట. దీంతో డాక్టర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా దీపికా ఇంటికే పరిమితమని అంటున్నారు. అయితే విటమిన్ డి-3 లోపానికి సంబంధించి ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో దీపికా చికిత్స తీసుకుంటున్నారట. ఇప్పటికే ఒక మోతాదు డి-3 విటమిన్ ఆమెకు అందించారని, ఆమె కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. డాక్టర్ సూచించిన డి-3 ట్రీట్ మెంట్ పూర్తయ్యాకే ఆమె షూటింగ్స్ కు వస్తారని టాక్.
ఇది ఇలా ఉండగా ఇర్ఫాన్ ఖాన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున సంగతి తెలిసిందే, అయితే నిజానికి దీపికా, ఇర్ఫాన్ ఖాన్ కలిసి విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటించాల్సి ఉంది, అదే సమయంలో ఈ ఇద్దరూ ఇలా అనారోగ్యం పాలవడం సినిమాను ప్రశ్నార్థకం చేసిందట. ఇక పద్మావత్ లాంటి పాత్ర తర్వాత.. అంతే ప్రాధాన్యమున్న పాత్రలకు మాత్రమే ఓకె చెప్పాలని దీపికా భావిస్తోంది. అనారోగ్యం వెంటాడుతున్నా.. కాస్త తీరిక చేసుకుని కొంతమంది దర్శకులు ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నట్టు టాక్. అంత బలమైన క్యారెక్టరైజేషన్ లేని కొన్ని స్క్రిప్టులను కూడా ఇప్పటికే ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది. అలాగే పారితోషికం విషయంలోనూ మునుపటికంటే ఎక్కువగానే డిమాండ్ చేస్తోందట దీపికా.