అల్లు అర్జున్ బాంబ్ పేల్చేసాడుగా ! టచ్ చేస్తే షాకే

2018-03-16 537

Director Vakkantham Vamshi recently shooted a scene of Naa Peru Surya, according to the buzz it was mind blowing scene

బన్నీ కెరీర్ లోనే హైఓల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే తన టెంపర్ ఏంటో చూపించిన ఈ సూర్య.. సినిమాలో ఇంకెంత అగ్రెసివ్‌గా కనిపిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది. డైరెక్షన్ మొదటిసారే అయినా.. వక్కంతం వంశీ ట్రీట్ మెంట్ కూడా బాగా పేలినట్టే కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటికే అన్ని వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన సూర్య.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.
'నా పేరు సూర్య'కు సంబంధించి ప్రస్తుతం కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ బాంబ్ బ్లాస్ట్ సీన్ షూట్ చేసినట్టు సమాచారం. ఈ సీన్ ఔట్ పుట్ కూడా ఓ రేంజ్ లో వచ్చిందంటున్నారు. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే తన టేకింగ్ పనితనమేంటో చూపించిన వక్కంతం వంశీ.. ఈ సీన్ ను కూడా అద్భుతంగా తెరకెక్కించినట్టు టాక్.
ఉదయాన్నే హడావుడిగా ఆఫీసులకు పరుగుపెట్టేవాళ్లు.. రోడ్డు దాటుతూ స్కూలుకు వెళ్లే చిన్నారులు.. ఇలా ఎవరి ప్రపంచంలో వారు ఉన్నవేళ.. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో ఓ బాంబ్ బ్లాస్ట్. ఊహించని ఈ పరిణామానికి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోతుంది.
బాంబ్ బ్లాస్ట్ జరగడమే ఆలస్యం.. అక్కడికి సూర్య వస్తాడు. అప్పటికే ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధిస్తారు. ఆవేశపరుడు, కోపిష్టి అయిన సూర్య.. అక్కడి దృశ్యాలను చూసి ఒక్కసారి చెమ్మగిల్లినవాడిలా మారుతాడు. అదే సమయంలో పరిస్థితులను చూసి రగిలిపోతాడు. ఆపై ఏం చేశాడన్నది మాత్రం ఇక తెరపై చూడాల్సిందే.
సినిమాలో బాంబ్ బ్లాస్ట్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రియలిస్ట్‌గా, కళ్లకు కట్టినట్టు చూపించేలా సీన్ ను తెరకెక్కించినట్టు టాక్. బన్నీ యాంగ్రీ లెవల్స్‌ను పీక్స్‌లో చూపిస్తున్న ఈ సినిమాలో.. కొన్ని సన్నివేశాలు 'టచ్ చేస్తే షాకే..' అనేలా ఉంటాయట. అంత పవర్ ఫుల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.