India vs Bangladesh 5th T20I Highlights : India Entered Nidahas Trophy Final

2018-03-15 81

India defeated Bangladesh by 17 runs to enter final clash of the Nidahas Trophy Tri-Series.Rohit Sharma (89) and Suresh Raina (47) guided India to 176/3

నిదాహాస్ ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా విజయంతో టీమిండియా ముక్కోణపు సిరిస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌ స్సినర్లకు అనుకూలంగా ఉండటంతో బౌలింగ్‌ ఎంచుకున్నట్లు బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో స్పల్ప మార్చులు చోటు చేసుకున్నాయి. జయదేవ్‌ ఉనాద్కత్‌ స్థానంలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన ఈ హైదరాబాదీకి ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు అవకాశం లభించింది. భారత ఓపెనర్లు నిలకడగా ఆడారు. ఓపెనర్ శిఖర్ ధావన్(35) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన సురేష్ రైనాతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ టీ20ల్లో 13వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కి 102 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆరంభంలో నిలకడగానే బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ చివర్లో దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోర్ చేసింది. రుబెల్ వేసిన 20 ఓవర్ మొదటి బంతికి రైనా(47) సౌమ్య సర్కార్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అదే ఓవర్ చివరి బంతికి రోహిత్(87) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రుబెల్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు.
177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది
బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్పికర్‌ రహీమ్‌ (55 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్సు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ లిటన్ దాస్(7), సౌమ్యా సర్కార్(1), తమీమ్ ఇక్బాల్(27)లను స్వల్ప స్కోర్‌కే పెవిలియన్‌కు చేర్చాడు.