భరత్ అనే నేను చిత్రం టార్గెట్ ఎవరో తెలిసిపోయింది

2018-03-14 679

Koratala Siva targets social issues in Bharat ane nenu movie. He is directing Mahesh Babu second time. In this movie Koratala showing ap special status issues also.

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం భరత్ అనే నేను. మహేష్ ని కొరటాల శివ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా భరత్ అనే నేను చిత్ర కథ గురించి మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో ఉమ్మడి ఏపీ నేపథ్యంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. సమాజంలోని ప్రధాన సమస్యలని ముఖ్యమంత్రిగా మహేష్ ఎలా పరిష్కరించాడో ఈ చిత్రంలో కొరటాల చూపించబోతున్నారు.
టీజర్ విడుదలయ్యాక భరత్ అనే నేను చిత్రంపై అంచనాలుఅమాంతం పెరిగిపోయాయి. ముఖ్యమంత్రిగా స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు అదరగొడుతున్నాడు. ఇక ఈ స్టైలిష్ సీఎం సినిమాలో చేసే విన్యాసాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో కొరటాల శివ ఎలాంటి సామజిక సమస్యలపై గురిపెట్టాడు అనే ఆసక్తి కలుగుతోంది. ప్రామిస్ చేసి మాట తప్పితే మనిషే కాదు అనే పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి.
భరత్ అనే నేను చిత్రంలో కొరటాల శివ ప్రధానంగా కొని సమస్యలని హైలైట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్, విద్య గురించి ఈ చిత్రంలో ప్రధానమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లలో మహేష్ పలికే డైలాగులు ఆకట్టుకోవడం ఖాయం అని సమాచారం.
కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేయవలసిన ఫండ్స్ అంశం గురించి కూడా ఈ చిత్రంలో ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కొరటాల శివ కొన్ని అద్భుతమైన డైలాగులు రాశారట.
భరత్ అనే నేను చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. కొరటాల ఈ చిత్రం విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. మరో బ్లాక్ బాస్టర్ ఖాయం అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.