An intermediate second-year student Sudheer was dragged out of a running bus and hacked with a machete near the Kukatpally traffic police station. As Investigation follows Kukatpally Assistant Commissioner of Police, said that it was an “act of vengeance” over a petty issue.
కూకట్‌పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం హత్యకు దారి తీసిన పరిస్థితులు చూచాయగా అర్థమవుతున్నాయి. హత్య జరిగిన తీరు కూడా సినీ ఫక్కీలోనే జరగడం గమనార్హం. ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సుధీర్, ఎలగల రాజు, రాణి దంపతుల కుమారుడిగా గుర్తించారు. గతంలో ఇంటర్ ఫెయిల్ అయిన సుధీర్.. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు.
సోమవారం ఉదయం 8గం.కు సుధీర్ తన స్నేహితుల తో పాటు కూకట్‌పల్లిలోని పరీక్షా కేంద్రానికి బైక్ పై బయలుదేరారు. కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ వద్దకు వీరు రాగానే.. మూసాపేట జిల్లెల బస్తీకి చెందిన జిల్లా మహేష్ అతని స్నేహితులు అడ్డుకున్నారు.సుధీర్ బైక్ ను అడ్డుకున్న మహేష్ అతని స్నేహితుల ఫై వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. దీంతో వారి నుంచి తప్పించుకున్న సుధీర్.. జాతీయ రహదారి పై అటుగా వెళ్తున్న స్కూల్ బస్సు ఎక్కాడు. ఆ వెంటనే బస్సులోకి ఎక్కిన మహేష్&గ్యాంగ్ అతన్ని బయటకు లాక్కొచ్చి.. విచక్షణారహితంగా దాడి చేశారు. వేటకొడవళ్లతో నరికి చంపేశారు. అయితే సుధీర్‌పై దాడిని చూసి అడ్డుకోవడానికి వెల్లిన కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసులు.. అప్పటికే అతను రోడ్డు పై కుప్పకూలి ఉండటం చూసి, నిందితులు మహేష్, కృష్ణ, తేజలు వై-జంక్షన్ వైపు పారిపోగా.. నవీన్ అనే యువకుడిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నవీన్ పోలీసులపై దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు నవీన్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.