Samantha Face Bad Incident In Anantapur భాదపడుతూ వెళ్లిపోయిన సమంత!

2018-03-13 1,841

Samantha has inaugurated Mobile showroom in Anantapur. Fans in large numbers came to see their favourite actress Their his fans showed bad incident in Anantapur. To take situvation in controll Samantha fan beaten by police.

సినీతారలు ఎక్కడ కనిపించినా అభిమానుల్లో పెద్దఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది. ఆ ఉత్సాహం, అభిమానం హద్దులు దాటుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టాలీవుడ్ లో సినీతారలంటే అభిమానులు వెర్రెత్తిపోయే అభిమానాన్ని ప్రదర్శిస్తారు. పిచ్చి అభిమానం వలన అటు సినీతారలకు, అభిమానులకు ఇబ్బందికర ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే హీరోయిన్ సమంతకు అనంతపురంలో ఎదురైంది. అభిమాని ప్రదర్శించిన అత్యుత్సాహం వలన అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
అసలు ఎం జరిగింది అంటే సమంత అనంతపురం జిల్లాలో మెరిసింది, ఓ మొబైల్ షోరూం ఓపెనింగ్ సందర్భంగా సమంత అనంతపురంకు వెళ్ళింన సమంతను చూసేoదుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఓ అభిమాని సమంతని చూడాలనే మితిమీరిన ఉత్సహంతో దూసుకొచ్చాడు. దీనితో అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అతడిని నిలువరించే క్రమంలో పోలీస్ లు అతడిపై లాఠీ ఛార్జ్ చేసారు.అనుకోకుండా జరిగిన ఘటనతో సమంత మనస్తాపం చెందింది, కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.