ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదంలో పడ్డ విద్యార్థులు, వీడియో !

2018-03-12 976

Two groups of trekkers got trapped in a forest mishap in the Kurangani hills near Bodi in Theni district on Sunday.

తమిళనాడులోని తేని జిల్లా బోడి సమీపంలోని కురంగణి అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 25 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. మంటలకు ఓ విద్యార్థిని ఆహుతి అయింది. పలువురికి గాయాలయ్యాయి. ఈరోడు, కోయంబత్తూరు నుంచి కళాశాల విజ్ఞాన యాత్ర కోసం విద్యార్థులు అడవుల్లోకి వెళ్లారు. వారు అడవిలోకి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో విద్యార్థులంతా మంటల్లో చిక్కుకున్నారు.
సమాచారం అందుకునన అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో విద్యార్థులను రక్షించే ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. దాదాపు కిలోమీటర్ మేర మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులతో సమాచారం అందే అవకాశం లేకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిసామి విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారత వైమానిక దళాన్ని రంగంలోకి దింపారు. సహాయ చర్యలను విద్యార్థులను సురక్షితంగా బయటకు రప్పించడానికి వైమానిక దళం తోడ్పాటు అందించనుంది. డిప్యూటీ సిఎం ఓ పన్నీర్ సెల్వం కూడా సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు ట్రెక్కింగ్ కోసం అటవీ శాఖ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. ట్రెక్కింగ్ చేస్తూ విద్యార్థులు పర్వతం మీదికి ఎక్కినప్పుడు అగ్ని ప్రమాదం సంభవించింది. 10 -15 మంది విద్యార్థులను రక్షించి గుట్ట పై నుంచి కిందికి తీసుకుని వచ్చినట్లు నిర్మలా సీతారామన్‌కుక జిల్లా కలెక్టర్ తెలియజేశారు.