Telangana Rastra Samithi (TRS) candidates for Rajya Sabha elections will be announced by Telangana CM K Chandrasekhar Rao tomorrow.
రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అభ్యర్థుల ఎంపికకు ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు టిఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు.
రాజ్యసభ ఎన్నికలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సతోష్ పేరు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన కేసీఆర్‌కు సమీపం బంధువు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారిక న్యూస్ చానెల్ టీన్యూస్ సివోగా కూడా వ్యవహరిస్తున్నారు
యాదవ కోటాలో జైపాల్ యాదవ్‌కు గానీ లింగయ్య యాదవ్‌కు గానీ అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. జైపాల్ యాదవ్ అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. మరో స్థానానికి మాజీ మంత్రి ఉమామాధవ రెడ్డి మహబూబ్ అలీఖాన్‌తో పోటీ పడుతున్నారు. ఉమామాధవ రెడ్డి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్‌లో చేరారు. ఈ నెల 12వ తేదీన వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.