YSRCP MP Vijayasai Reddy said that they hope BJP regarding special status promise to Andhrapradesh, it's indicating that YSRCP may planning to go with BJP
జాతీయ న్యూస్ చానల్ 'ఇండియా టుడే'లో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో భాగంగా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా.. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ విజయసాయిని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా, మరి ఆ పార్టీతో కలుస్తారా? అన్న ప్రశ్నకు.. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమని విజయసాయి పేర్కొన్నారు.
కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదన్న విజయసాయి బీజేపీపై సానుకూలంగా స్పందించడం గమనార్హం. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోదీ తమ డిమాండ్‌ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని విజయసాయి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బీజేపీతో జతకట్టడానికి ఆ పార్టీ ఉవ్విళ్లూరుతున్నట్టే కనిపిస్తోంది.
హోదా బీజేపీ మాత్రమే ఇవ్వగలదన్న నమ్మకాన్ని వైసీపీ ఓవైపు వ్యక్తం చేస్తూనే.. మరోవైపు అవిశ్వాసానికి సిద్దపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. అంటే, కేవలం టీడీపీని ఇరుకునపెట్టేందుకే ఆ పార్టీ అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.