Venkatesh Rebounces Back వెంకీ అరిపించాడు

2018-03-09 1,187

Venkatesh new look goes viral in social media. Teja, Venky movie go floors from next week
వెంకటేష్ నటిస్తున్న తాజాగా చిత్రం 'ఆట నాదే వేట నాదే'. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానాని తేజ రాజకీయ నాయకుడిగా ప్రజెంట్ చేసాడు. లేటెస్ట్ గా తేజ తెరకెక్కించబోయే చిత్రంలో వెంకి లుక్ బయటకు వచ్చింది.

దర్శకుడు తేజ చాలా కాలం పాటు పరాజయాలతో సతమతం అయ్యాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ మంచి పొలిటికల్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తేజలో మళ్ళీ ఉత్సాహం నెలకొంది.

నేనే రాజు నేనే మంత్రి చిత్రం అందించిన విజయంతో తేజకు మళ్ళీ అవకాశాలు వెల్లువెత్తాయి. తేజ రెండు క్రేజీ చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు.

ప్రస్తుతం తేజ చేతిలో వెంకటేష్ చిత్రంతో పాటు, బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి కూడా తేజనే దర్శకుడు.

తేజ, వెంకీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్ర లుక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భుజాన బ్యాగు, చేతిలో పుస్తకాలు, స్టైలిష్ గడ్డం లుక్ లో వెంకీ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాడు. చూడగానే నచ్చేసే విధంగా ఈ లుక్ లో వెంకీ ఉన్నాడు.