Arjun Kapoor feels Boney, Janhvi, Khushi need him

2018-03-09 1,020

Arjun Kapoor move in with half-sisters Janhvi and Khushi. Emotional movement for Boney Kapoor because With Sridevi's sudden loss, it has been a difficult time for Boney Kapoor, Janhvi and Khushi.
శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీదేవి మరణం ఎలా ఉహించని విధంగా జరిగిందో, అదేవిధంగా అర్జున్ కపూర్, అన్షులా ఊహించని విధంగా తండ్రి కుటుంబానికి చేరువవుతున్నారు. శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్, అన్షులా తండ్రి బోనికపూర్ తో పాటు చెల్లెళ్ళు జాన్వీ, ఖుషికి మానసిక స్థైర్యాన్ని అందించి వారికి అండగా నిలిచారు.

అర్జున్ కపూర్ కొద్దిరోజుల క్రితం వరకు తండ్రి బోనికపూర్ తో అంటి ముట్టనట్లు ఉన్నారు. కానీ శ్రీదేవి మరణం తరువాత పరిస్థితి పూర్తిగా మారినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబంలో నెలకొన్న ఎమోషనల్స్ తో అంతా ఒక్కటైపోతున్నట్లు సంకేతాల అందుతున్నాయి. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న జాన్వీ, ఖుషిని కూడా అర్జున్ కపూర్ చేరదీసే ప్రయత్నాలు చేతునట్లు వార్తలు వస్తున్నాయి.

జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా అర్జున్ కపూర్ సోదరి అన్షులా కూడా హాజరయ్యింది. ఇంగ్లాడ్ లో తన సోదరుడు అర్జునకపూర్ నటిస్తున్న నమస్తే ఇంగ్లాడ్ చిత్రానికి అన్షులా పని చేస్తోంది. జాన్వీ పుట్టిన రోజు సంధర్భంగా అన్షులా ఇంగ్లాండ్ నుంచి ముంబై రావడం విశేషం.