Mahesh's Movie Is In Lead.. పవన్ కళ్యాణ్ ని వెనక్కి నెట్టేసిన మహేష్ బాబు

2018-03-07 1,614

The teaser of 'Bharat Ane Nenu' released yesterday evening and in less than 24 hours, the Mahesh Babu starrer had crossed 10 million views. 1 Cr digital views came in just 18 hours. It clocked in 7 million views on Youtube and 3 million views on Facebook beating records of all recent Telugu movies.
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వహించిన 'భరత్ అనే నేను' టీజర్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌ యూట్యూబ్, ఫేస్ బుక్‌లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగుల దెబ్బకు.....బాహుబలి మినహా ఇప్పటి వరకు టాలీవుడ్లో వచ్చిన ట్రైలర్, టీజర్ వ్యూస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

మంగళవారం సాయంత్రం ‘భరత్ అనే నేను' టీజర్ విడుదలవ్వగా కేవలం 19 గంటల్లోనే 10 మిలియన్(కోటి) డిజిటల్ వ్యూస్ సాధించింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్. ఇందులో 7 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ద్వారా రాగా, 3 మిలియన్ వ్యూస్ ఫేస్ బుక్ ద్వారా వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ‘డివివి ఎంటర్టెన్మెంట్స్' ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ వ్యూస్ పరంగా ఇప్పటి వరకు ‘బాహుబలి-2' ట్రైలర్ నెం.1 స్థానంలో ఉంది. ఈ ట్రైలర్ 24 గంటల్లో 21.7 మిలియన్ వ్యూస్ సాధించింది.

యూట్యూబ్ వ్యూస్ పరంగా అజ్ఞాతవాసి టీజర్ 24 గంటల్లో 6.4 మిలియన్ సాధించి మూడో స్థానంలో నిలిచింది. అజ్ఞాతవాసి ట్రైలర్ 6.2 మిలియన్ వ్యూస్ సాధించి 4వ స్థానంలో ఉంది.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం' టీజర్ 24 గంటల్లో 5.9 మిలియన్ వ్యూస్ సాధించింది.