TODAY'S BIG NEWS BIG BITE : Budget session updates, AP special status, Third Front

2018-03-07 1

TODAY'S BIG NEWS BIG BITE
Andhra Pradesh special status issue, Third Front,
After Lenin And Periyar Statues Vandalised, PM Narendra Modi Intervenes. And Budget session updates.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడో రోజైన బుధవారం కూడా టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రత్యేక హోదాపై వైసీపీ, టీడీపీలకు కాంగ్రెస్ కూడా జత కలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదాపైటీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. బీజేపీ సేనలు అన్నంత పనిచేశాయి. త్రిపురలో అధికారంలోకి వచ్చిన వెంటనే లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన బీజేపీ.. తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసింది.

లెనిన్ విగ్రహం కూల్చివేత తర్వాత తదుపరి లక్ష్యం పెరియార్ విగ్రహాన్ని కూల్చడమే అని ట్వీట్ బీజేపీ నేత హెచ్.రాజా ట్వీట్ చేయడం.. ఆ వెను వెంటనే పెరియార్ విగ్రహం ధ్వంసం కావడం దేశంలో పరిస్థితులకు అద్దం పడుతోంది.