Balakrishna's Visual Treat For Fans అధిరిపోనున్న నందమూరి ప్లాన్..

2018-03-07 308

NTR biopic launch on March 29th. Balakrishna doing big arrangements for the event.
ఎన్టీఆర్ బయోపిక్ భారీ స్థాయిలో పార్రంభం అయ్యేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనే కోరికతో ఈ చిత్రానికి బాలకృష్ణ స్వయంగా పూనుకున్నారు. భారీ స్థాయిలో అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రం రూపు దిద్దుకోబోతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయమే నందమూరి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.

ఎన్టీఆర్ చిన్నతనంలో చోటుచేసుకున్న సంఘటనల నుంచి అయన జీవితంలో కీలక అంశాలన్నింటినీ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ ఈ చిత్రంలో మొత్తం 62 గెటప్స్ లో కనిపిస్తారట. ప్రతి చిన్న అంశాన్ని రాజీపడకుండా చిత్రీకరించాలని బాలయ్య భావిస్తున్నాడు.

ఎన్టీఆర్ బియోపిక్ చిత్ర లాంచింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 న రామకృష్ణ సుడియో లో ఈ వేడుక జరగబోతోంది.