Nayanthara quality time with her boyfriend

2018-03-06 496

Nayanthara, who is basking in the success of her films Aramm and Velaikkaran, seems to have taken some time out to spend quality time with her boyfriend Vignesh Shivan in the US. Vignesh also has a lot to celebrate since his last directorial Thaana Serndha Kootam with Suriya turned out to be a massive hit. The Naanum Rowdy Dhaan director shared some pictures from their trip on social media goes viral.

అందాల తార నయనతార మరోసారి పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నది. దర్శకుడు విగ్నేష్ శివన్‌తో అతిసన్నిహితంగా ఉంటున్న ఈ సుందరి తాజాగా హాట్‌హాట్‌ ఫోటోలతో సోషల్ మీడియాలో అలజడి చేసింది. అమెరికాలో విగ్నేష్ కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వారి మధ్య కేవలం అఫైర్ కంటే మరేదో బంధం ఉందని ఆ ఫోటోలు సాక్ష్యంగా నిలిచాయి.

కెరీర్‌పరంగా నయనతార వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నది. అరమ్, వెలాక్కైరన్ సినిమాల విజయంతో నటిగా మరో మెట్టు ఎక్కింది. సోలో హీరోయిన్‌గా సక్సెస్‌లను సొంతం చేసుకోవడం దక్షిణాదిలో నయనతారకే చెల్లింది. విజయానందంలో ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్ విగ్నేష్ శివన్‌తో అమెరికాలో విహారయాత్ర చేస్తున్నది.

సూర్యతో తీసిన గ్యాంగ్ చిత్రం విగ్నేష్ శివన్‌కు మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రం తర్వాత సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి ఇదే సమయం అనుకొని నయనతారతో యూఎస్‌ ట్రిప్ వెళ్లారు. యూఎస్ వెకేషన్‌లోని ఫొటోలను విగ్నేష్, నయనతా తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు.

అభిమానుల తాకిడి దూరంగా అమెరికాలో నయనతార, విగ్నేష్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలలో స్పష్టమైంది. అమెరికాకు వీరు వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది నెలల క్రితం నయన్, విగ్నేష్ ఇద్దరు కలిసి యూఎస్‌కు వెళ్లడం జరిగింది.