Telugu Desam Party (TDP) MPs staged protest outside parliament today. The parliamentarians protested in front of Mahatma Gandhi statue in Parliament premises demanding 'Special Category Status' to Andhra Pradesh.
పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రెండో రోజైన మంగళవారం కూడా నిరసనలు తెలిపారు. మరోవైపు విపక్షాలు బ్యాంకు స్కాంపై ఆందోళన తెలిపింది. దీంతో ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోకసభ, రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. తిరిగి లోకసభ 12 గంటలకు ప్రారంభమైనప్పుడు కూడా గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీలు వివిధ అంశాలపై నిరసన తెలుపుతూ ప్లకార్డులతో వెల్లోకి చొచ్చుకెళ్లారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
పార్లమెంటు గేటు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. టీడీపీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవ సభ నిర్వహించింది. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కృష్ణుడి వేషంలో వచ్చిన ఎంపీ శివప్రసాద్.. నేడు ఎన్టీఆర్ వేషధారణలో వచ్చారు.
గోవిందా.. గోవిందా అని తాము ప్రారంభించామని, మోడీ ప్రభుత్వం కిందకు దిగి వచ్చి తమ కోరికలను నెరవేరిస్తే తప్ప తమ ఆందోళన కొనసాగుతుందని జేసీ చెప్పారు. బహుశా పార్లమెంటు చరిత్రలో గాంధీ విగ్రహం వద్ద ఇన్ని పార్టీలు ఒక్కటై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నదంటే ఇది అపూరవ సంఘటన అన్నారు.